- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
R5 Zone: స్పీడ్ పెంచిన జగన్ .. రెండు రోజుల్లో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన
దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఆర్5 జోన్ అంశంపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంది. అయినా ఆ జోన్‌లో ఇళ్లు నిర్మించేందుకు సీఎం జగన్ రెడీ అయిపోయారు. ఆర్5 జోన్‌లో 50 వేల ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 24న శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా క్లారిటీ ఇచ్చారు. మొత్తం 50 వేల కుటుంబాలకు ఆర్5 జోన్‌లో ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
చంద్రబాబు అండ్ కో కోర్డుకు వెళ్లి అభివృద్ధిని అడుకుంటున్నారన్నారు. అయినా అన్నీ ఇబ్బందులను అధిగమిస్తున్నామని చెప్పారు. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆటంకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఏజెన్సీలకు, కేంద్రానికి లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. సీఆర్డీఏ చట్టంలో 5 శాతం పేదలకు ఇవ్వాలని ఉందని సజ్జల గుర్తు చేశారు.
అమరావతిలో సంపన్నులు మాత్రమే ఉండాలనేది టీడీపీ కల అని సజ్జల విమర్శించారు. అమరావతిలో రాజధాని అనే భ్రమను చంద్రబాబు సృష్టించారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో సింగపూర్ కంపెనీకి 300 ఎకరాలు ఎవరి అనుమతితో ఇచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న రైతులు, కూలీలు చంద్రబాబు హయాంలోనే వలస వెళ్లిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.