Breaking: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్ట్

by srinivas |   ( Updated:2024-02-29 08:42:01.0  )
Breaking: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు.. శరత్‌ను అరెస్ట్ చేశారు. అయితే శరత్ అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఎన్నికలు వస్తున్న సమయంలో పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా టీడీపీ తరపున చిలకలూరి పేట అభ్యర్థిగా శరత్ తండ్రి పత్తిపాటి పుల్లారావును అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను మానసిక క్షోభకు గురి చేసేందుకే అధికార పార్టీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారని పుల్లారావు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పత్తిపాటిని ఢీకొట్టలేకనే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు.

Next Story

Most Viewed