రాష్ట్ర బడ్జెట్ ఆ వ్యవస్థలకు కొత్త ఊపిరి: మంత్రి పత్తిపాటి కీలక వ్యాఖ్యలు

by srinivas |
రాష్ట్ర బడ్జెట్ ఆ వ్యవస్థలకు కొత్త ఊపిరి: మంత్రి పత్తిపాటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు(Former Minister Pattipati Pullarao) అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌(State Budget)పై ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ఇందులో భాగంగా బడ్జెట్ కేటాయింపులు జరిపిందని ఆయన తెలిపారు. కంపెనీలు, ఆర్థిక వ్యవస్థలకు బడ్జెట్ కేటాయింపులు కొత్త ఊపిరిని అందిస్తాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామన్నారు. వ్యవసాయ బడ్జెట్‌తో సాగు రంగం జవసత్వాలు అందుతాయన్నారు. అన్నదాత సుఖీభవకు రూ. 4500 కోట్లు కేటాయించి మాట నిలబెట్టుకున్నామని పత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, రైతులకు అధిక లబ్ధి కోసమే ఈ బడ్జెట్‌ కేటాయింపులు జరిపామని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed