- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP High Court: వైసీపీకి మరో బిగ్ షాక్.. విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే ఎన్నికల్లో ఘోర పరాభవంతో కోలుకోలేని స్థితిలో ఉన్న వైసీపీ (YCP)కి మరో బిగ్ షాక్ తగిలింది. విజయనగరం (Vizianagaram) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC By-election) రద్దు అయింది. ఈ మేరకు ఉప ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తాజాగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు (AP High Court) ఉత్తర్వుల మేరకు ఈసీ (EC) నోటిఫికేషన్ రద్దు చేసింది. కాగా, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు (MLC Indukuri Raghuraju)పై మండలి చైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై అభియోగం మోపారు.
దీంతో ఎమ్మెల్సీ రఘురాజు శాసనమండలి చైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఇందుకూరి రఘురాజు (Indukuri Raghu Raju)పై అనర్హత చెల్లదంటూ ఏపీ హైకోర్టు (AP High Court) తీర్పును వెలువరించింది. అదేవిధంగా రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విజయనగరం (Vizianagaram) స్థానిక సంస్థల ఉప ఎన్నికల ప్రక్రియ రద్దు అయింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఉప ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.