- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్ల మరో దందా.. డయాగ్నోస్టిక్ సెంటర్ల నిలువు దోపిడీ
దిశ, పల్నాడు: జిల్లాలో డయాగ్నోస్టిక్ సెంటర్లు దోపిడీకి అడ్డాలుగా మారాయి. రోగుల అనారోగ్యాన్ని ఆసరా చేసుకొని కాసులను కాజేస్తున్నాయి. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి నుంచి స్కానింగ్, ఎక్స్ రే, ఇతర పరీక్షల పేరుతో వేలల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ఫీజుల వసూళ్లలో నియంత్రణ లేకపోవడంతో, సామాన్యులు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తుంది.
కుప్పలుతెప్పలు..
జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో డయాగ్నోస్టిక్ సెంటర్ల వందల సంఖ్యలో ఉన్నాయి. డాక్టర్లు కూడా ఫలానా చోటుకు వెళ్లి పరీక్షించుకోండి అని అంటుండటంతో, రోగులు కూడా ఏం చేయాలో పాలుపోక చెప్పినంత ఫీజు చెల్లించి వస్తున్నారు. కాస్త ఫీజు తగ్గించమని అడిగినా, కుదరదని కటువగా చెప్పేస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్ల నిర్వాహకులతో, డాక్టర్లు మిలాఖాత్ అయి రోగుల నడ్డి విరుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలు కంటే కొసరు ఎక్కువ..
చిన్న జ్వరంతో వెళ్లినా, టెస్టులు చేయించడం తప్పనిసరి అన్నట్లు కొందరు వైద్యులు మారిపోయారు. రోగం తెలుసుకోకుండా వైద్యం ఎలా చేసేది అంటూ, డయాగ్నోస్టిక్ సెంటర్ల నుంచి వచ్చే కమిషన్ల కోసం అనవసర టెస్టులు రాస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు పీఆర్వోలను సైతం నియమించుకొని మీకింత మాకింత.. అనే ట్యాగ్ లైన్‌తో రోగులను దోచుకుంటున్నట్లు తెలుస్తోంది.