- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పగలంతా నిద్ర ఉండటం లేదు.. ప్లీజ్ మీరైనా ఆయనకు ఓసారి చెప్పండి !
దిశ, కారంపూడి : నేను అనగా ఎల్ఈడీ బల్బును. ప్రతి గ్రామంలో రాత్రి సమయంలో నిరంతరం చీకట్లను చీలుస్తూ వెలుగులు అందిస్తుంటాను. వాహనదారులు, పాదాచారులకు రోడ్డు కనిపించేలా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటాను. గ్రామంలోకి దొంగలు వచ్చినా గుర్తించడానికి వెలుతూరును ఇస్తాను. కానీ ఈ గ్రామ కార్యదర్శి నన్ను 27/7 నిరంతరం వెలిగిస్తున్నాడు. నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇలా 24 గంటలు వెలుగులు ఇస్తే నా జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. పైగా కరెంట్ అధిక వాడకం వల్ల ప్రజలపై ఆర్థికభారం పడుతుంది. విద్యుత్ ఏఈ, లైన్ మెన్లు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే అందరికీ నష్టమే కదా.. అందుకే మీరన్నా ఆ కరెంట్ అధికారులకు చెప్పండి. అయినా ఇవాళ (సోమవారం) ఇటువైపు వచ్చిన కారంపూడి ‘దిశ’ పత్రిక విలేకరి నా బాధను చూశాడు. నా పరిస్థితిని గమనించి ఫొటో కూడా తీసుకున్నాడు. ఆయన ద్వారా నేను అనుభవిస్తున్న బాధ ఉన్నతాధికారులకు చేరుతుందని భావిస్తున్న. ఇక రేపటి నుంచైనా నేను రాత్రి సమయాల్లో మాత్రమే వెలుగును ఇస్తాననే నమ్మకం కలిగింది.
ఇదీ.. కారంపూడి మండలం, కొదమగుండ్ల పంచాయితీలోని బ్రాహ్మనాయుడు కాలనీ విద్యుత్ బల్బుల దుస్థితి. రాత్రి సమయాల్లోనే వెలగాల్సిన లైట్లు నిరంతరం వేసి ఉంచుతుండటంతో విద్యుత్ వాడకం పెరగడంతోపాటు లైట్లు తొందరగా పాడైపోతున్నాయి. దీంతో చాలా వీధుల్లో, రోడ్లపై చీకట్లు అములుకుంటున్నాయి. అధికారులు పట్టపగలే వెలుతూర్లను నిత్యం చూస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా పంచాయితీ అధికారులు స్పందించి రాత్రి సమయాల్లో మాత్రమే కరెంట్ బల్బులు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.