- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీకి రాజధానిగా అమరావతికే జై కొట్టిన కాంగ్రెస్
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి రాజధాని అమరావతేనని ఏపీ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆరు గ్యారంటీ పథకాలతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక్క సీటు కూడా గెలవని ఆ పార్టీ... తాజా ఎన్నికల్లో కొన్ని చోట్ల అయినా గెలిచి ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. ఈ మేరకు కొత్త సంవత్సరం నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నేత, మాజీ ఎంపీ జేడీ శీలం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అమరావతే రాజధాని అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి సీఎం జగన్, చంద్రబాబు, పవన్ లొంగిపోయారని తెలిపారు. విభజన హామీల విషయంలో బీజేపీ ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని జేడీ శీలం మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామన్నారు. ఏపీలో రాహుల్ గాంధీతో సభలు నిర్వహిస్తామన్నారు. తిరుపతిలోనూ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్తీకరణలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని జేడీ శీలం హామీ ఇచ్చారు.