- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశా మాలవ్యకు Cm Jagan రూ.10 లక్షలు ప్రోత్సాహం
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పర్వతారోహకురాలు ఆశా మాలవ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ఆశా మాలవ్యను ప్రత్యేకంగా సీఎం వైఎస్ జగన్ అభినందించి ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆశా మాలవ్య సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తైనట్లు వివరించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆశా మాలవ్య కృషిని సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు.