- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Chandrababu Naidu : రూ.320కే కిలో నెయ్యి.. ఎలా..?
దిశ, వెబ్ డెస్క్: రూ. 320కే కిలో నెయ్యి ఎలా దొరకుతుందని సీఎం చంద్రబాబు (Cm Chandrababu) ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం(Tirumala Laddu Prasadam Dispute)పై స్పందిస్తూ అమరావతి (Amaravati)లో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. శ్రీవారి లడ్డూను గత పాలకులు అప్రవితం చేశారని ఆరోపించిన చంద్రబాబు.. నెయ్యి కల్తీ ఘటనపై మరింత లోతుగా విచారణ జరగాలన్నారు. రూ. 320కే కిలో నెయ్యి (Ghee) కొనుగోలుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ (Ys Jagan) హయాంలో ఇలాంటి దుస్సాహసాలు చాలా చేశారని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
లడ్డూ వివాదంతో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు వేదపండితులను, మఠాధిపతులతో చర్చిస్తున్నామని తెలిపారు. లడ్డూల తయారీలో రివర్స్ టెండరింగ్ ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. తప్పు చేసి రివర్స్ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే టీటీడీ (TTD)ని ప్రక్షాళన చేస్తామని చెప్పామని, ప్రస్తుతం ఆ పనిలో ఉన్నామన్నారు. ఇలాంటి ఘటనలను రోజూ బయటకు వచ్చి చెప్పలేమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో శ్యామలారావు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. ఏడు కొండల స్వామిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajasekhara Reddy) వ్యవహరించిన తీరును తాను గతంలోనే ఖండించానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.