- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: చంద్రబాబును వదలని సీఐడీ.. మరో కేసు నమోదు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ వదలడంలేదు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబును జైలుకు పంపింది. ఆయన బెయిల్‌పై విడుదల అయిన వెంటనే టీడీపీ హయాంలో మద్యం వ్యవహారంలో కుంభకోణం జరిగిందంటూ మరో కేసు నమోదు చేసింది. తాజాగా ఇంకో కేసును సైతం తెరపైకి తీసుకొచ్చింది. చంద్రబాబు హాయాంలో ఇసుకకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ సీఐడీకి ఏపీఎమ్‌డీసీ ఫిర్యాదు చేసింది. దీంతో చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని, ఏ4గా దేవినేని ఉమను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని కేసు నమోదు చేశారు. ఈమేరకు వీరికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతో ఏపీ సీఐడీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సీఐడీ అనుకూలంగా మారిందని మండిపడ్డారు. సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.