- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు తో భేటీ అయిన బీజేపీ,జనసేన నేతలు..
దిశ ప్రతినిధి,గుంటూరు: ఉండవల్లి లోని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గృహం లో బీజేపీ, జనసేన నేతలు సోమవారం చంద్రబాబు తో భేటీ అయ్యారు.కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేక్ వత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బై జయంత్ పాండా, శివ ప్రకాష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్,నాదెండ్ల మనోహర్ చంద్రబాబు ఇంటికి చేరుకొని చర్చలు ప్రారంభించారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరటంతో ఈ సమావేశం కీలకంగా మారింది. బీజేపీ కి 6 ఏంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు, జనసేన కు 24 ఎమ్మెల్యే 2 ఏంపీ స్థానాలకు పోటీ చేసే విధంగా టీడీపీ తో పొత్తు కుదిరింది.
ఈ సమావేశం లో ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి. అభ్యర్థులు ఎవరూ అన్న దానిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం పై 3 పార్టీలకు చెందిన అభ్యర్థుల జాబితా లు వెలువడే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీల వర్గాలు ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆఛన్నాయుడు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఎమ్మెల్యే లు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబు ను కలిశారు.
Read More..
సీఎం జగన్‌కు ఆ పిచ్చి పట్టుకుంది: నారా లోకేష్ తీవ్ర విమర్శలు