విజయ్‌పాల్‌కు కస్టడీ పూర్తి.. జైలుకు తరలింపు

by srinivas |
విజయ్‌పాల్‌కు కస్టడీ పూర్తి..  జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌(Former CID ASP Vijay Pal) కస్టడీ(Custody) పూర్తి కావడంతో గుంటూరు కోర్టు(Guntur Court)లో ఆయన్ను పోలీసులు ప్రవేశపెట్టారు. కస్టడీలో రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు నివేదిక రెడీ చేసి కోర్టులో సమర్పించారు. ఈ మేరకు ఆయన రిమాండ్‌ను కంటిన్యూ చేస్తూ గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో విజయ్‌పాల్‌ను పోలీసులు జైలుకు తరలించారు. కాగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(MLA Raghuramakrishnam Raju)ను గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా ఉన్న విజయ్‌పాల్ కస్టోడియల్ టార్జర్‌కు పాల్పడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ రఘురామకృష్ణంరాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే అరెస్ట్ చేసిన సమయంలో జైలులో రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ చేశారు. దీని వెనుక విజయ్‌పాల్ ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రఘురామకృష్ణం రాజు ఫిర్యాదును చేసిన కనీసం విచారణ కూడా జరపలేదు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఉండి పోటీ చేసి ఎమ్మెల్యేగా రఘురామరాజు గెలిచారు. ఆ తర్వాత తనపై టార్చర్ కు పాల్పడిన విజయ్ పాల్ కేసు నమోదు చేయాలని సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు.. విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరింత లోతుగా విచారణ జరిపేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరడంతో అందుకు అనుమతించింది. ఈ మేరకు రిమాండ్ లో ఉన్న విజయ్ పాల్ ను రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించి కోర్టులో ప్రవేశపెట్టడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ధర్మాసనం సూచించింది.

Advertisement

Next Story

Most Viewed