- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో178 మంది ఏపీ వాసులు
దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో వీరంతా ప్రయాణం చేశారు. ప్రమాదం జరగడంతో వీరి వివరాలను రైల్వే అధికారులు తెలుసుకుంటున్నారు. మృతులు, క్షతగాత్రులు, మిస్సింగ్ వివరాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.
విశాఖ నుంచి 110 మంది, విజయవాడ నుంచి 39 మంది, రాజమండ్రి నుంచి 26 మంది తాడేపల్లి గూడెం నుంచి ఒకరు వెళ్లినట్లు గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియడం లేదు. అయితే విజయవాడలో 39 మంది దిగాల్సి ఉంది. వీరిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారు. ఏడుగురి ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. మరో ఐదుగురి ఫోన్లు లిఫ్ట్ చేయని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఏపీ అధికారుల బృందం ఒడిశా వెళ్లింది. సంఘటన స్థలాన్ని ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పరిశీలించారు. అటు మంత్రి అమరానాథ్ బృందం కూడా రైలు ప్రమాదంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తెలుగువారికి సహాయ చర్యలు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
లోకేష్‌కు ప్రాణహాని ఉంది.. డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ