Ap Cabinet Meeting: 14న కీలక బిల్లుల ఆమోదానికి ఛాన్స్

by srinivas |   ( Updated:2023-03-02 14:41:35.0  )
Ap Cabinet Meeting: 14న కీలక బిల్లుల ఆమోదానికి ఛాన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మార్చి 14న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతి సచివాలయంలో మధ్యాహ్నాం 12గంటలకు ఈ మంత్రి వర్గ సమావేశం కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే ఇండస్ట్రియల్ పాలసీపైనా చర్చించే అవకాశం ఉంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కి సంబంధించి పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా నిబంధనలు సడలించే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు విద్యార్థులకు యూనిఫామ్ మార్పు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed