- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ రైతు ద్రోహి: Alapati Raja
దిశ, డైనమిక్ బ్యూరో: రైతుల కష్టాన్ని, వారి భూముల్ని దోచుకునే జగన్.. రైతుద్రోహి కాక, రైతుబాంధవుడవుతాడా? అని మాజీమంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. జగన్ రెడ్డి అసమర్థతతో రాష్ట్ర వ్యవసాయరంగం నిర్వీర్యమైందని ఆయన ఆరోపించారు. పని చేయని రైతు భరోసా కేంద్రాలు, అరకొరగా ఇచ్చే రైతు రుణమాఫీ రైతుల్ని రక్షించి, వ్యవసాయాన్ని బతికించదని అప్పట్లో జగన్ చెప్పాడని గుర్తు చేశారు. చంద్రబాబు రైతులకు అందించిన పథకాల్ని ఇప్పుడు ఎందుకు రద్దు చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
రివర్స్ టెండరింగ్ డ్రామాలతో పోలవరాన్ని నాశనం చేసిన ఘనుడు వైఎస్ జగన్ అని ఆలపాటి రాజా విమర్శించారు. అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తానన్న జగన్, నాలుగేళ్లలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి కల్పించాడని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ప్రభుత్వం రైతుల్ని ఏవిధంగా దోచుకుందో చెప్పడానికి జగన్ తెనాలి వస్తున్నాడా? అని ప్రశ్నించారు. దుగ్గిరాల పసుపు రైతుల వేదన, రోదనపై ముఖ్యమంత్రి ఏం చెబుతాడని నిలదీశారు. ఎన్నికల దృష్ట్యా రైతుల్ని మరోసారి వంచించి, తన పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నాడని మాజీమంత్రి ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.