Breaking: గుంటూరు మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం

by srinivas |
Breaking: గుంటూరు మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రీ సైక్లింగ్ సంచుల గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గోడౌన్‌లో నిల్వ ఉంచిన మిర్చిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అయితే భారీ నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆరు గాలం పండించిన మిర్చి పంటను రైతులు మిర్చి యార్డులో నిల్వ ఉంచారు. మిర్చి యార్డులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story