Gummanuru Jayaram: నాపై ఆ వార్తలు రాశారో.. చంపేస్తా: మీడియాపై గుమ్మనూరు జయరాం హాట్ కామెంట్స్

by Shiva |
Gummanuru Jayaram: నాపై ఆ వార్తలు రాశారో.. చంపేస్తా: మీడియాపై గుమ్మనూరు జయరాం హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం (MLA Gummanuru Jayaram) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా, ఆయన మీడియా ప్రతినిధులపై చేసి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. గుంతకల్లు (Guthakallu) సిటీ శివారులో ధోని మొక్కల లేఔట్‌లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం (MLA Gummanuru Jayaram) పలువురు అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం లే అవుట్‌లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు సమస్యల గురించి ఆరా తీశారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. గతంలో కబ్జాకి గురైన ఇళ్ల పట్టాలపై విచారణ చేపట్టాలని అక్కడున్న అధికారులకు ఆదేశించారు.

అదేవిధంగా తనపై కొందరు భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ వార్తలు రాస్తున్నారని.. ఆ వార్తలు రాసే ముందు నిరూపించే ధైర్యం ఉన్న వాళ్లే అలాంటి వార్తలు రాయాలన్నారు. అడ్డగోలుగా వార్తలు రాస్తే.. రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తనకు మీడియా అంటే ఏమాత్రం నాకు లెక్క లేదని కామెంట్ చేశారు. తాను అన్నీ పనులు చేసి వచ్చిన వాడినని.. రాసుకోండి.. ఏం రాసుకుంటారో అంటూ తేల్చి చెప్పారు. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే మాత్రం తాట తీస్తానని హెచ్చరించారు. ఒక వేళ తప్పులు ఉంటే వాటన్నింటినీ నిరూపించాలని మీడియా ప్రతినిధులకు సవాల్ విసిరారు. అయితే, మీడియాపై కూటమి పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో కూటమి అధిష్టానం ఎలా రియాక్ట్‌ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed