- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆయనకు ఇద్దరు పూజార్లు.. గుమ్మనూరు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు గుమ్మనూరు జయరాం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో సీఎం జగన్ ఓ జీసస్ ఓ అల్లా అని పొగిడిన మీరు ఇప్పుడు జగన్ నుండి ఎలా విడిపోతున్నారు అని మీడియా ప్రతినిధి అడిగారు. ఇక ఆ ప్రశ్నపై స్పందించిన జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 2019లో మంత్రి అయ్యాక కూడా 2022 వరకు జగన్మోహన్ రెడ్డిని ఓ జీసస్, అల్లా గానే చూశానని పేర్కొన్నారు.
అయితే 2022 తరువాత జగన్ గుడిలో శిల్పంగా మారిపోయారని.. ఆ శిల్పానికి 2022 తరువాత మాటలు రావడంలేదని ఆరోపించారు. ఇక ఆ శిల్పానికి ఇద్దరు పూజార్లు ఉన్నారని.. వారు ధనుంజయరెడ్డి,సజ్జల రామకృష్ణారెడ్డి అని పేర్కొన్నారు. ఇక ఇద్దరు పూజార్లు శిల్పం వెనకకు వెళ్లి వాయిస్ ఇస్తుంటారని ఎద్దేవ చేశారు. ఇక ఆ పూజార్లు వారసత్వంగా కొడుకులకు న్యాయం చేస్తారు కానీ భక్తులకు న్యాయం చెయ్యరని స్పష్టంగా చెప్పగలను అని తెలిపారు.
ఆ పూజార్లు వారసత్వంగా కొడుకులకు పెద్దపీట వేస్తారుగాని భక్తులకు పెద్దపీట వెయ్యరు అని మండిపడ్డారు. అందుకే తాను విడిపోతున్నట్లు స్పష్టం చేశారు.