- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాల్లో గ్రూప్ -2 పరీక్ష..
దిశ, ప్రతినిధి: గ్రూప్ -2 పరీక్ష ఆదివారం విశాఖ జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాల్లో జరగనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు జరిగాయి. పరీక్షకు మొత్తం 47,491 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ ,పరీక్ష ఉదయం 10:30 గం.ల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 47,491 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష సజావు నిర్వహణకు గాను 105 మంది లైజన్ అధికారులు, 105 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 29 మంది రూట్ అధికారులను నియమించినట్లు వివరించారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అధికారులు సూచించారు. పరీక్ష హాల్లోకి ఎటువంటి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలను అనుమతించరాదని చెప్పారు.పరీక్ష కేంద్రం లోనికి గంట ముందు అభ్యర్థులు చేరుకోవాలని, ఉదయం 10:15 గం.దాటిన తరువాత అనుమతించబోరని స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని పటిష్ట చర్యలు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు హాలులోనే ఉండాలని హితవు పలికారు.