- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వ వైఖరి నన్ను బాధించింది: Nara Bhuvaneshwari
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ తదితర పరిణామాలపై నారా భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి వర్ధంతి కార్యక్రమానికీ నేతలను వెళ్లనీయరా..ఇదెక్కడి న్యాయం? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. టీడీపీ నేతల నిర్భంధంపై నారా భువనేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది అని అన్నారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? అని నిలదీశారు. ఇదేమి చట్టం...ఇదెక్కడి న్యాయం? అంటూ భువనేశ్వరి మండిపడ్డారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి తనను ఎంతో బాధించింది అని స్పష్టం చేశారు. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది అని అన్నారు. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను నారా భువనేశ్వరి కోరారు.