ఏపీలో రైతులు, విద్యార్థులు, మత్యకారులకు భారీ గుడ్ న్యూస్

by srinivas |
ఏపీలో రైతులు, విద్యార్థులు, మత్యకారులకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రైతులు(Formers), విద్యార్థులు(Studnets), మత్య్సకారుల(Fishermen)కు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలో ఈ రోజు భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 14 అంశాలకు గ్రీన్ ఇచ్చింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం డబ్బులు చెల్లించాలని నిర్ణయించింది. అటు రైతులకు కూడా కేబినెట్ శుభవార్త చెప్పింది. కేంద్ర ఇస్తున్న రూ. 10 వేలకు మరో పది వేల రూపాయలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మత్య్సకారుల సంక్షేమంపైనా ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చించిన కేబినెట్.. హాలిడే సమయంలో రూ. 20 వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed