- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మా కంపెనీపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్
దిశ, వెబ్ డెస్క్ : అచ్యుతాపురం ఫార్మా కంపెనీపై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్దమైంది. గురువారం ప్రమాద ఘటనా స్తలాన్ని పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇంతవరకు కంపెనీ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఫార్మా కంపెనీలో నిబంధనల మేరకు ఎస్వోపి అనుసరించలేదని అన్నారు. కార్మికుల భద్రతకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, కనీస ప్రమాణాలు పాటించలేదని సీఎం అన్నారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నామని, నివేదిక వచ్చాక తీవ్ర చర్యలు తీసుకుంటాం అన్నారు. అసలు ప్రమాదం జరిగినపుడు అక్కడ ఏం జరిగింది, కంపెనీలో లోపాలపై కమిటీ ప్రధానంగా విచారించున్నట్టు తెలుస్తోంది. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలకు నోటీసులు పంపుతామని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.