Visakha: ప్రమాదకరంగా కొండవాలు ప్రాంతం.. కూలిపోయే స్థితిలో భవనాలు..!

by srinivas |   ( Updated:2024-09-08 12:06:14.0  )
Visakha: ప్రమాదకరంగా కొండవాలు ప్రాంతం.. కూలిపోయే స్థితిలో భవనాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా గోపాలపట్నం కొండవాలు ప్రాంతం ప్రమాదకరంగా మారింది. జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. కొండవాలు ప్రాంతంలోని పురాతన భవనాలు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నారు. కొండవాలుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ఇప్పటికే కూలిపోయింది. కరెంట్ స్తంభాలు సైతం కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వర్షం మరింతగా కురిస్తే భవనాలు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. క్షణంలోనైనా భవనాలు పడిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. భవనాలు, ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. స్థానికులను పునరావాసాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ, పోలీసులు, అధికారులు సహాయ చర్యలు అందిస్తున్నారు. 13 ఇళ్లల్లోని 37 మంది ప్రజలకు పునరావాసాలకు తరలించారు. ప్రాణ నష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో పక్కనున్న బిల్డింగులను సైతం ఖాళీ చేయించారు. పై నుంచి వస్తున్న వాటర్‌ను డైవర్ట్ చేస్తే ప్రమాదం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story