- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, మిర్చి రైతుల (Chilli Farmers) పట్ల కేంద్రం (Union Government) తీసుకున్న నిర్ణయం హర్షనీయమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. ఏపీలోని మిర్చి రైతులకు మద్దతు ధర (support price) పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మిర్చికి క్వింటాలుకు కనీస మద్దతు ధర (minimum support price) రూ. 11,781 చెల్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంపై నారా లోకేష్ ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. గత పాలకులు (previous rulers) కేసుల మాఫీ (waiver of cases) కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం (progressive government) నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తోందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) చేసిన ప్రయత్నాలు ఫలించాయని సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక కేంద్రప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రి నిరంతరం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెప్పారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (Market Intervention Scheme) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం భరించేలా మిర్చిరైతులకు క్వింటాలు కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని వివరించారు. 2024-25 సంవత్సరంలో రైతులు పండించిన 2.58లక్షల టన్నుల మిర్చిని కనీస మద్ధతుధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని అన్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, ముఖ్యమంత్రి వినతికి పెద్దమనసుతో సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కి, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Union Minister Shivraj Singh Chouhan) కి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు (Central Government Officials) ప్రత్యేక కృతజ్ఞతలు (special gratitude) తెలియజేశారు.