AP:రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
AP:రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. నిన్న (శనివారం) గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ .. రేషన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని విమర్శించారు. ఈక్రమంలో పేదలకు అందాల్సిన రేషన్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.

Advertisement

Next Story