AP News: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

by Jakkula Mamatha |
AP News: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తామని ప్రభుత్వం(Government) ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మద్యం ప్రియులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎంఎన్‌సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. మెక్‌డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న(శుక్రవారం) రాష్ట్రానికి చేరుకుంది.

దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను(Popular brands) త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులు తెలిపారు. జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే వస్తాయన్నారు. గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని.. మద్యం రేటు పెరగడంతో పేదలు గంజాయికి అలవాటు పడ్డారని ప్రభుత్వం తెలిపింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల పేర్కొనడం జరిగింది.

Next Story

Most Viewed