AP News:ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Jakkula Mamatha |   ( Updated:2024-09-15 10:28:31.0  )
AP News:ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఏపీలో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా పలు చోట్ల వరదలు బీభత్సం(Panic) సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరదల వల్ల వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అయితే ప్రకృతి వైపరీత్యాలలో(natural disasters) మొదటిగా నష్టపోయేది రైతులే. వర్షాలు, ఎండలు, వరదలు ఇలా రకరకాల వాతావరణ పరిస్థితులతో అన్నదాతలకు ఆరుగాలం కష్టమే. కావున రైతన్నల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు బీమా పథకాలను(Insurance plans) అమలు చేయడం జరుగుతోంది.

అయితే రైతులు పంట బీమా సదుపాయం పొందేందుకు ఈ-క్రాప్(e-crop) నమోదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ- క్రాప్ గడువును ప్రభుత్వం పొడిగించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ బుకింగ్(e-crop Booking) నేటితో(సెప్టెంబర్ 15) ముగిసింది. అయితే ఇంకా పలుచోట్ల పంటల నమోదు చేయాల్సి ఉన్నందున ఈ గడువును మరో 15 రోజలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పంటల బీమాతో పాటుగా, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో పంటలు సాగుచేసిన రైతులు అందరూ తప్పనిసరిగా ఈ- క్రాప్‌లో పంటల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed