విశాఖలో మరో అంతర్జాతీయ కార్యక్రమం.. నవంబర్ 2న జగన్ చేతుల మీదుగా ప్రారంభం

by Javid Pasha |
విశాఖలో మరో అంతర్జాతీయ కార్యక్రమం.. నవంబర్ 2న జగన్ చేతుల మీదుగా ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో మరో కీలక సమావేశానికి రంగం సిద్దమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇరిగేషన్ మీట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 2న ఈ సమ్మిట్ జరగనుండగా.. ఇందులో సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో 90 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. దీంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని స్పష్టం చేశారు.

నీటి పారుదల, జలవనరుల పరిరక్షణ లాంటి అంశాలపై వీరు చర్చిస్తారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ సమ్మిట్ జరగనుంది. సీఎం జగన్ నవంబర్ 2న సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత భారత్‌లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో హాజరయ్యే అతిథులకు బస, భోజనం, రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed