ఎమ్మెల్సీగా మాధవ్‌ని గెలిపించండి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-04 08:15:12.0  )
ఎమ్మెల్సీగా మాధవ్‌ని గెలిపించండి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, ఉత్తరాంధ్ర : భారత్ దర్శన్ పథకంలో భాగంగా అరకు, లంబసింగిలకు రూ.75 కోట్ల మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంద్రి కిషన్ రెడ్డి తెలిపారు. విశాఖలో విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. అన్నవరం, శ్రీశైలం, అమరావతి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కూడా అల్లూరి 125వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తామన్నారు. రాజమండ్రిలో సంగీత నాటక అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

విశాఖ లాంటి నగరంలో ప్రజల తలలో నాలుకలా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. గత ఆరేళ్లలో ఎమ్మెల్సీగా మాధవ్ ఉత్తరాంధ్రకే పరిమితం‌ కాలేదని ఏపీ సమస్యలన్నిటి మీద గల మెత్తని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మద్దతు ఇచ్చి గెలిపించాలన్నారు. బాల్యం నుంచీ మాధవ్ జన జీవితంలో ఉన్న వ్యక్తి అన్నారు.

ఆయన తండ్రి చలపతిరావుగా దేశభక్తికి, నిజాయతీకి, సేవా, అంకిత భావాలకీ ప్రతీక అన్నారు. మాధవ్ వారి అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పరిచయాలు, పలుకుబడి ఉన్న వ్యక్తిగా సమస్యలపై పోరాటం చేయగలరన్నారు. ఏపీలో కుటుంబ రాజకీయాలు ప్రజలకు నష్టం చేస్తున్నాయని తెలిపారు. రాజకీయాల్లో నాయకులు అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా సాగాలని తెలిపారు.

కక్ష సాధింపులు, ప్రతీకారాలతో అభివృద్ధి జరగదన్నారు. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులు, సంస్థలూ ఉత్తరాంధ్రకు వచ్చేలా మాధవ్ సమన్వయం చేస్తారని తెలిపారు. మరింత అభివృద్ధి సాధించటానికి మరోసారి ఆయనను ఎన్నుకోవాలని కోరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ.. మోడీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. మౌలిక వసతుల కల్పన నుంచి సుస్థిరాభివృద్ధికి అవసరమైన రెన్యూవబుల్ ఎనర్జీ వరకూ అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు పారిశ్రామిక వేత్తలకు ఉత్తేజాన్నిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story