రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కండి : సీఎం జగన్ ఆదేశాలు

by Seetharam |   ( Updated:2023-09-14 12:28:54.0  )
రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కండి : సీఎం జగన్ ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సీలబస్‌ అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల ప్రొఫైల్స్‌ మారాలని సీఎం జగన్ ఆదేశించారు. బయట స్కూళ్లకంటే, ప్రభుత్వ స్కూళ్లే ఉన్నతం అన్న రీతిలో మన స్కూళ్లు తయారు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఇంగ్లిషు మీడియం, తరగతి గదుల డిజిటలీకరణ, నాడు – నేడు పనులు చేపడుతున్నాం. వీటికి తోడు ఐబీ లాంటి సిలబస్‌ను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల దశ మరో స్థాయికి చేరుకుంటుంది. ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ప్రాథమిక విద్యలో నూటికి నూరుశాతం పిల్లలు బడిలోనే ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. తాజా డ్రైవ్‌లో భాగంగా ప్రతి పిల్లాడూ బడిలో ఉండేలా చూసుకున్నామని అధికారులు వివరించారు. సీనియర్‌ సెకండరీ విభాగంలో 96.94 శాతం మంది బడిలో ఉన్నారని, హయ్యర్‌ సెకండరీ విభాగంలో 74.9శాతం బడిలో ఉన్నారని అధికారులు తెలిపారు. అమ్మ ఒడి, 10, 12 తరగతులు ఫెయిల్‌అయిన వారికి రీ అడ్మిషన్, స్కిల్‌ సెంటర్లలో చేర్పించి వారికి ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్, వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేసిన ప్రచారం వల్ల సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 83,52,738 మంది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకున్న విద్యార్థులు ఉన్నట్టుగా తేలిందని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు.

ట్యాబుల వినియోగంపై సీఎం ఆరా

ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటిల్‌అసిస్టెంట్లతో డివైజ్‌ వినియోగంపై బడిపిల్లలకు క్లాసులు ఇప్పించాలని సూచించారు. తొలివిడతగా నిర్దేశించుకున్న మేరకు ఇప్పటికి 4,804 స్కూళ్లలో 30,213 ఐఎఫ్‌పీలు బిగించామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 6,515 పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీల బిగింపు కూడా పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీల వినియోగింపై టీచర్లకు శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. మొదటి ఫేజ్‌లో నాడు – నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లకు డిసెంబర్‌ నాటికి ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు కావాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో కూడా బ్రాడ్‌ బ్యాండ్‌ లేదా 4జి ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఉన్నచోట రెండు రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వచ్చే డిసెంబరు కల్లా ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలు ఉన్న పాఠశాలలకు పూర్తిగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పాఠ్యప్రణాళికలోని పాఠ్యాంశాల కంటెంట్‌ వీరికి అందుబాటులో ఉంచాలన్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో, ఫోన్‌ ఎస్డీ కార్డులో, యూ ట్యూబ్‌లో, ట్యాబుల్లో, ఐఎఫ్‌పీలో, అధీకృత వెబ్‌సైట్లలో, ఇ–పాఠశాల డీటీహెచ్‌ల్లో ఇలా ఎందులోనైనా ఒకే పాఠ్యప్రణాళిక, ఒకే పాఠ్యాంశాలు ఉంచామని అధికారులు వెల్లడించారు. ఆగస్టులో నిర్వహించిన మొదటి అసెస్మెంట్‌ పరీక్షల్లో మూడో తరగతి నుంచి 9 వతరగతి వరకూ దాదాపు 91.33 శాతం మంది పిల్లలు ఇంగ్లిషు మాధ్యమంలో పరీక్షలు రాశారని అధికారుల వెల్లడించారు.

టోఫెల్‌ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధంపైనా ఆరా

టోఫెల్ పరీక్షలకు సంబంధించి వారంలో మూడురోజులపాటు మూడు పీరియడ్ల మేర శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. ప్రతిరోజూ కూడా కనీసం అరగంట సమయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పిల్లలు క్రమంగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. వీటితోపాటు ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సీలబస్‌పైనా సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ స్కూళ్ల ప్రొఫైల్స్‌ మారాలని సీఎం జగన్ ఆదేశించారు. బయట స్కూళ్లకంటే, ప్రభుత్వ స్కూళ్లే ఉన్నతం అన్న రీతిలో మన స్కూళ్లు తయారు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఇంగ్లిషు మీడియం, తరగతి గదుల డిజిటలీకరణ, నాడు – నేడు పనులు చేపడుతున్నాం. వీటికి తోడు ఐబీ లాంటి సిలబస్‌ను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల దశ మరో స్థాయికి చేరుకుంటుంది.ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి.ఐబీ సిలబస్‌ విషయంలో దశలవారీగా అమలుచేసే విషయంపైనా అధ్యయనం చేయాలి ప్రస్తుతం అనుసరిస్తున్న సిలబస్, ఐబీ సిలబస్‌తో అనుసంధానం, ట్రాన్సిషన్‌ సజావుగా, సులభంగా ఉండేలా మార్గదర్శక ప్రణాళికలో పొందుపరచాలి. మార్గదర్శక ప్రణాళిక తయారులో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక భవిష్యత్‌ టెక్నాలజీపై అవగాహన, శిక్షణపై సమావేశంలో చర్చ జరిగింది. సీఎం ఆదేశాలమేరకు ఆరోతరగతి నుంచి ప్రత్యేక సబ్జెక్టుగా బోధన ఇప్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. శిక్షణ, బోధన కార్యక్రమాలకు సమీపంలోని ఇంజినీరింగ్‌ కాలేజీలను అనుసంధానం చేస్తున్నామన్నారు. ఏఐపై పాఠ్యాంశాలు బోధించేందుకు యాప్‌ కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని అధికారులు తెలిపారు.

మన బడి నాడు–నేడు పనులపై సమీక్ష

రెండో విడత నాడు – నేడు పనులుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతిమండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు, అందులో ఒకటి బాలికలకోసం పెట్టాలన్న సీఎం ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 679 మండలాల్లో 473 మండలాల్లో ప్రభుత్వ బాలికలు మరియు కో –ఎడ్యుకేషన్‌ కాలేజీలు ఉన్నాయని.. కేవలం రెండు మండలాల్లో బాలికలకు కాలేజీలు లేవు అని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. 206 మండలాల్లో కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కాలేజీలు లేవు. కేవలం బాలికలకోసం జూనియర్‌ కాలేజీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అక్కడున్న హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జూనియర్‌ కాలేజీలుగా మార్చడానికి గుర్తించిన హైస్కూళ్లతో జాబితాను రూపొందించామని..ఖరారు చేసిన తర్వాత ఈ హైస్కూళ్లలో అవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఐఎప్‌పీ సహా అన్నిరకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

నాణ్యమైన ఆహారం అందించాలి

ఈ ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు ఖర్చుచేస్తున్నాం అని అన్నారు. మెనూను మార్చి పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. రాగిజావను కూడా ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ తగ్గకూడదని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించారు. ప్రతిరోజూ కూడా పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల నాణ్యత ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈమేరకు ఎస్‌ఓపీ ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలపై శ్రద్ధపెట్టాలి. వారికి మంచి పౌష్టికాహారం, మందులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed