సీఎం జగన్‌‌తో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా భేటీ

by Javid Pasha |   ( Updated:2023-05-24 16:15:51.0  )
సీఎం జగన్‌‌తో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌‌తో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌ బుధవారం భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ఆమెతో సీఎంతో చర్చించారు. తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని జగన్ మైకేలాకు హామి ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మ్యాను ఫ్యాక్చరింగ్‌, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ సస్టెయినబిలిటీ, సస్టెయినబుల్‌ ప్రాక్టీసెస్, ఆటోమెటివ్‌ అండ్‌ ఇంజినీరింగ్, జాయింట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఐటీ అండ్‌ డిజిటలైజేషన్, స్టార్టప్‌ ఎకో సిస్టమ్, ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ప్రోగ్రామ్స్, ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ వంటి వివిధ రంగాలలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ జగన్‌కు చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, జర్మనీ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

అవినాష్ అరెస్ట్ ఆపుతోందెవరు!?

Advertisement

Next Story

Most Viewed