- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konaseema: బోరుబావి నుంచి ఎగసిపడుతున్న గ్యాస్
దిశ, అమలాపురం: అంబేద్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో బోర్ బావి నుంచి గ్యాస్ వెలువడటంతో అ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15 మీటర్లు పైకి గ్యాస్ ఎగజిమ్ముతుండటంతో స్థానికులు అయా ప్రాంతాలను ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోతున్నా రు. గతంలో ఇదే భూమిలో వేసిన బోరుబావి ప్రస్తుతం వాడకంలో లేకపోవటం, పరిసరాల్లో జన సంచారం లేకపోవడంతో ప్రమాద సూచికలు లేవు. బావి నుంచి భారీగా గ్యాస్ ఎగసిపడుతుండటంతో గెయిల్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. కాగా కోనసీమ ప్రాంతంలో గ్యాస్ వెలికితీత కార్యకలాపాలు నిర్మహించే గ్యాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా, ఓఎన్జీసి, జిఎస్పీసి వంటి సంస్థల కార్యకలాపాలతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణమే సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.