Ganesh Laddu: గణేషుడి లడ్డూకు.. వేలంలో రికార్డు ధర!

by Geesa Chandu |
Ganesh Laddu: గణేషుడి లడ్డూకు.. వేలంలో రికార్డు ధర!
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ గ్రామీణం(Vijayawada Rural)లో పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్ లో నెలకొల్పిన వినాయక విగ్రహ లడ్డూ ప్రసాదాన్ని నవరాత్రి వేడుకల చివరి రోజు సందర్భంగా వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గణేషుడి లడ్డూ ప్రసాదాన్ని.. విఫోదా ఫిస్పైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్న సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, బాలాజీ, నక్కా రామ్ లు రూ. 26 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. విజయవాడ గ్రామీణంలో నెలకొల్పిన వినాయక మండపంలో లడ్డూ వేలం, రికార్డు ధర పలికి హైలెట్ గా నిలిచింది.

ఈ వేలం పాటలో వచ్చిన మొత్తం రూ. 26 లక్షలను.. శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్ వినాయక మండప కమిటీ నిర్వహణ సభ్యులు రాజేష్, బ్రహ్మం, ప్రదీప్ లకు అందజేశారు. లడ్డూ వేలం లో విజేతగా నిలిచిన సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డిని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో విజేత సింగం రెడ్డి ప్రదీప్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అపార్ట్మెంట్ లో నెలకొల్పబోయే వినాయకుడి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే వేలం పాటలో లడ్డూను పెద్ద మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story