- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నన్ను జైల్లో పెట్టినా నీ కడుపుమంట చల్లారలేదా?'
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే తాము పోరాటం చేస్తుంటే తమపై దుష్ప్రచారం చేస్తారా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. పోలీస్ శాఖ భూమికోసం తాము పోరాటం చేస్తుంటే తమపై అవాకులు చవాకులు పేళుతారా అని మండిపడ్డారు. మహిళలను అసభ్యకరంగా తాకుతూ.. వారిని నడిరోడ్డు పై ఈడ్చివేసిన దృశ్యాలు పోలీస్ సంఘాలకు కనిపించవా ? అని ప్రశ్నించారు.
పోలీసులకు తల్లి, చెల్లి, భార్య కూడా ఆడవారే కదా ? ఆమాత్రం ఇంగితం కూడా లేకుండా మహిళలపట్ల దురుసుగా ప్రవర్తిస్తే దానికి పోలీస్ సంఘం వత్తాసు పలుకుతుండటం వారి విజ్ఞతకే వదిలేస్తున్న అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి పేర్ని నాని తనను జైల్లో పెట్టించేందుకు వాడే టైం బందరు అభివృద్ధిపై దృష్టిపెడితే బాగుంటుందని తెలిపారు. పేర్ని నాని ఆదేశాలతోనే పోలీసులు మహిళలను వేధించారని చెప్పుకొచ్చారు. 54 రోజులు తనన్ను అక్రమ కేసులో రాజమహేంద్రవరం జైల్లో పెట్టిన ఇంకా పేర్నినానికి కడుపుమంట చల్లారడం లేదు అని విమర్శించారు. ఇప్పటికే దాదాపు 15 అక్రమ కేసులు నాపై పెట్టాడు.ఇంకా పెడతాడు కూడా. పేర్నినాని ఎన్ని కేసులు పెట్టిన వారి అవినీతిని, అక్రమాలను ప్రశ్నించడం మానేది లేదు.కోట్ల విలువచేసే భూమిని అప్పనంగా వైసీపీ పార్టీ కి ఇస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు. దీనిపై చట్టపరంగా పోరాటం చేస్తాం. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రతిపక్షంగా మా బాధ్యత. ఒక ఎకరా అని పైకి చెబుతున్నారు కానీ అంతర్గతంగా 5 ఎకరాలు దోచుకునే కుట్ర దీని వెనుక ఉంది అని చెప్పుకొచక్చారు.
ఈ కుట్రలో అధికారులు కూడా భాగమయ్యారు అని సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మునిసిపల్ అధికారులు, తహసీల్దార్ మీద దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తున్నాం..ఏ ఒక్క అధికారిని వదిలేదు లేదు అని హెచ్చరించారు. తప్పు చేసిన ప్రతి అధికారిని చట్టంముందు దోషులుగా నిలబెడతాం. ప్రజా ఆస్తులను కాపాడే విషయంలో ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధం అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Read More: అమలాపురం ఎంపీ అభ్యర్థి ఎవరు.. కొత్త ముఖం పరిచయం కాబోతుందా ?