- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Illegal liquor:అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత..నలుగురు వ్యక్తులు అరెస్ట్
దిశ,ఎమ్మిగనూరు:కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమంగా మద్యంను తరలిస్తున్న మహేంద్ర ఆల్ఫా డియక్స్ ఆటోను స్వాధీనపరచుకొని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్,అడిషనల్ ఎస్పీ సెబ్, కర్నూలు నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సెబ్ కర్నూల్ రవికుమార్ ఆధ్వర్యంలో మా సిబ్బందితో జరిపిన దాడులలో మంత్రాలయం మండలంలోనీ రాంపురం గ్రామం దగ్గరలో అక్రమంగా మహేంద్ర ఆల్ఫా డియక్స్ ఏపీ 21 టీ జెడ్ 8509 నెంబర్ గల ఆటోలో కర్ణాటక మద్యం తరలిస్తుండగా మంత్రాలయం మండలం కాచాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ఎ1 మాదిగ ప్రేమ్ కుమార్ (23) వయస్సు, ఎ2 యం.రవి (45) వయస్సు, A3 తెలుగు మహేష్ ( 26) వయస్సు, A4 యం.
హరికృష్ణ(31) వయస్సు, వారి వద్ద అక్రమ మద్యం 384(180 ఎంఎల్ ) మరియు 288 (90 ఎంఎల్) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని, ఆటో సీజ్ చేసి,నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. మద్యం, ఆటో విలువ మార్కెట్లో దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. ఈ దాడులలో డీటీఎఫ్ కర్నూల్ ఇఐ ఇ నరసానాయుడు, డీటీఎఫ్ కర్నూల్ కానిస్టేబుల్ కరుణాకర్, బషీర్, షేక్షావలి,హెడ్ కానిస్టేబుల్స్ వి.లింగ ప్రసాద్, గోపాల్ , కానిస్టేబుల్స్ భరత్, నరసింహ రెడ్డి మరియు లక్ష్మన్న పాల్గొన్నారు. ప్రజలు అక్రమ మద్యం గురించి ఫిర్యాదు చెయ్యదలిచినచో 9440902579 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.