- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలని పోలీసుల నోటీసులు

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former YCP MP Gorantla Madhav)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు(Vijayawada Cyber Crime Police) నోటీసులు అందజేశారు. కొద్దిసేపటి క్రితం మాధవ్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. సెక్షన్ 35/3 కింద నోటీసులు అందజేశారు. మార్చి 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవంబర్ 2, 2024న సైబర్ క్రైమ్ పీఎస్‌లో గోరంట్ల మాధవ్‌పై మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ(Former Women Commission Chairman Vasireddy Padma) ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని ఆమె చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు అందజేశారు. మరోవైపు పోలీసు అందజేసిన నోటీసులపై గోరంట్ల మాధవ్ స్పందించారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అయితే విచారణ తేదీని మార్చాలని కోరుతున్నానని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.