- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ కాలుష్యంపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్యపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుష్యాన్ని నియంత్రించాలని ఆయన వ్యాఖ్యానించారు. కాలుష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. ప్రతి ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కాలుష్యాన్ని కేంద్రం నివారించాలని సూచించారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. కాలుష్య నివారణ ఒక్క ఢిల్లీ ప్రభుత్వానిదే కాదని, కేంద్రంతో పాటు పక్క రాష్ట్రాలు కూడా బాధ్యతగా భావించాలన్నారు. పేదలకు కేంద్ర ఉచితంగా బియ్యం ఇవ్వడాన్ని వెంకయ్య నాయుడు స్వాగతించారు. పేదలంలో పేద, మధ్య తరగతి, అంతకన్నా దిగువన ఉన్న చాలా కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఎన్నికల్లో ఇచ్చే ఉచిత హామీలకు తాను వ్యతిరేకమని వెల్లడించారు. ఆర్థిక వనరులపై అంచనా వేయకుండా పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్నాయని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.