- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి
ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సీటు దక్కని తాజా, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. తనకు వైసీపీ పార్టీలో తీవ్ర అన్యాయం, అవమానం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తామని జగన్ మోసం చేశారని ఆరోపించారు. తనకు వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో మళ్లీ బాధ్యతల నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదన్నారు. తనకు పదవి కంటే గౌరవం ముఖ్యమని, గౌరవం ఎక్కడ దొరికితే అక్కడకు వెళతానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
Read More..
Advertisement
Next Story