రమణ దీక్షితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. పోలీసులకు కీలక ఆదేశాలు

by srinivas |
రమణ దీక్షితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. పోలీసులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై ఉన్న కేసును కొట్టివేయాలని ఆయన కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించింది. వ్యాజ్యాన్ని మూసివేసింది.

కాగా సోషల్ మీడియా వేదికగా టీటీడీ ఆలయం, అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రమణ దీక్షితులపై ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ ఐటీ శాఖ ఉద్యోగి మురళి సందీఫ్ ఇచ్చిన ఫిర్యాదుపై గతంలో రమణ దీక్షితులపై తిరుపతి వన్ టౌన్ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై రమణ దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ జరగగా సుప్రీంకోర్టు మార్గ దర్శకాల ప్రకారం పిటిషనర్‌కు 41ఏ నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని పోలీసులను హైకోర్డు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed