Supreme Court: డాక్టర్ ప్రభావతికి ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే

by srinivas |   ( Updated:2025-01-31 06:47:28.0  )
Supreme Court: డాక్టర్ ప్రభావతికి ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి(Dr. Prabhavathi)కి ఊరట లభించింది. మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడిల్ టార్చర్ కేసు(Raghuramakrishnan Raju Custodial Torture Case)లో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గతంలో హైకోర్టు(High Court) కొట్టివేసింది. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆమె సవాల్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ కేసులో పోలీసుల విచారణకు హాజరుకావాలని ప్రభావతికి ధర్మాసనం సూచించింది.

కాగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అదే పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్‌గా మారారు. అంతేకాదు ప్రజా సమస్యలు, ప్రభుత్వ పని తీరుపై ప్రశ్నించారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది. కేసు విచారణలో రఘురామరాజు కస్టోడియల్ టార్చర్‌కు గురయ్యారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఆయనపై దాడి జరిగింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందారు. కానీ రాఘురామకు ఎలాంటి గాయాలు కాలేదని డాక్టర్ ప్రభావతి నివేదికలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చేసిన ఫిర్యాదులో ఎలాంటి దర్యాప్తు జరగలేదు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని ప్రభావతికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు హైకోర్టుకు ఆమె వెళ్లారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ ధర్మాసనం అందుకు ఒప్పుకోలేదు. ప్రభావతి పిటిషన్‌ను కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో ఉండగా ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ప్రభావతి ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. తాజాగా జరిగిన విచారణలో ప్రభావతికి స్వల్ప ఊరట దక్కింది.

Next Story

Most Viewed