- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skill Case: చంద్రబాబు, జగన్‌కు మంచిదే.. ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకు అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఫైళ్లు మాయం కావడంపై పలు అనుమానాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.ఫైళ్లు మాయం అయింది టీడీపీ హయాంలోనా.. వైసీపీ హయాంలోనా అనేది తేలాల్సి ఉందన్నారు. చంద్రబాబు, జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ లేకుండా ఎలక్షన్ లేదని చెప్పారు. అవినీతి లేకుండా ఎవరైనా సరే ఓటుకు నోటు పంచలేరన్నారు. ఆస్తులు అమ్ముకుని ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసిన చరిత్ర లేదని చెప్పారు. చంద్రబాబుపై కేసు కక్ష సాధింపు చర్యేనని.. ఆ కేసును కొట్టేసే ధైర్యం ఏ జడ్జికైనా ఉందా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబుకు, జగన్‌కు మంచిదేనని ఉండవల్లి వ్యాఖ్యాంచారు.ఈ స్కాంలో చంద్రబాబుకు డబ్బులు వెళ్లినట్లు ఆధారాలు లేవని.. కాని ఆయన పీఏకు డబ్బులు చేరింది నిజమేనని చెప్పారు. 17(ఏ) వర్తిస్తే జగన్‌పై కేసులు ఉండవన్నారు. ఈ కేసును ఎంత కూల్‌గా తీసుకుంటే అంత మంచిదని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.