- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
YSRCP:వైసీపీకి మరో బిగ్ షాక్..పార్టీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు?
దిశ, డైనమిక్ బ్యూరో:ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుని ఘోర పరాజయాన్ని చూసిన వైసీపీకి మరికొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. గతంలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా ఇప్పుడు మరొకరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ విషయంపై ఆయన తన కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని గత ఎన్నికల్లో వంగా గీతకు పిఠాపురం సీటును కేటాయించారు. ఆమెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ 70వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన పార్టీని వీడి జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆయన 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కింది. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ ఆయనకు సీటు దక్కలేదు. మొన్నటి ఎన్నికల తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కలిసి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం.
గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్ది నెలల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. రాజీనామా చేయకుండానే వైసీపీ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఆయనకు సీటు కేటాయించలేదు. కేవలం పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగారు. కూటమి భారీ స్థాయిలో విజయం సాధించడంతో మారిన పరిణామాలతో ఆయన వైసీపీని వీడారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినా కారణాలు వేరే ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి అపజయం పాలైన కిలారి రోశయ్య కూడా వైసీపీని వీడారు. వైసీపీ శాసనమండలి చీఫ్‌విప్, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఈయన స్వయానా అల్లుడు. గుంటూరు పార్లమెంట్ ఇన్‌చార్జి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన నాలుగు రోజుల కిందట ప్రకటించారు. గత ప్రభుత్వంలో మైనింగ్ మాఫియా చేశారంటూ ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీని వీడతారని సమాచారం.