- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:కొడాలి నానికి క్యాన్సర్ అని ప్రచారం..స్పందించిన మాజీ మంత్రి?
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇది ఇలా ఉంటే వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి క్యాన్సర్ వచ్చిందన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘ వాళ్ల అమ్మగారు ఇటీవలే క్యాన్సర్ ను జయించారని చెప్పారు. చెకప్ కోసం ఆమె వెంట ఆసుపత్రికి వెళ్తే ఆయనకే వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు’. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని టీడీపీ వాళ్లు శునకానందం పొందుతున్నారని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైల్లో అరెస్ట్ కాబడిన వైసీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.
అనంతరం వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..టీడీపీ గుండాలపై ఎదురు తిరిగిన వంశీపై కేసులు పెట్టారన్నారని ఫైరయ్యారు. వంశీ న్యాయపరంగా రిలీఫ్ పొందిన తర్వాత వస్తారన్నారని తెలిపారు. టీడీపీ వాళ్ళు ఎన్నాళ్ళు ఇలా శునకానందం పొందుతారో చూద్దామని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయడం టీడీపీ పక్కన పెట్టేసిందని.. వైసీపీ జెండా మోసిన వారిని జైల్లో పెట్టడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇసుక, మట్టి, లే అవుట్లు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటున్నారని, సభలు, సమావేశాలలో మాత్రం అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారని..తెర వెనుక మాత్రం ఇసుక మట్టి లే అవుట్లు గురించే మాత్రమే చర్చ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.