బ్రేకింగ్: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత

by Satheesh |   ( Updated:2023-01-29 02:51:38.0  )
బ్రేకింగ్: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. మాజీ మంత్రి వసంత్ కుమార్ మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా, వైఎస్సాఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య హయంలో వసంత్ కుమార్ వివిధ శాఖల్లో మంత్రిగా పని చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పూళ్ల గ్రామానికి చెందిన వసంత్ కుమార్.. 2004, 2009లో ఉంగుటూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వసంత్ కుమార్ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story