వివేకా హత్య కేసు నుంచి జగన్ దంపతులు తప్పించుకోలేరు.. మాజీమంత్రి కేఎస్ జవహర్

by Javid Pasha |
వివేకా హత్య కేసు నుంచి జగన్ దంపతులు తప్పించుకోలేరు.. మాజీమంత్రి కేఎస్ జవహర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : 'జగనాసుర రక్తచరిత్ర' పుస్తకంలో అబద్ధాలుంటే, దానిలోని అంశాలపై సీఎం వైఎస్ జగన్ ఎందుకు విచారణ జరిపించడం లేదు? వివేకా హత్యపై జగన్ మౌనం వీడకుంటే, మౌనమే అర్థాంగీకారమని భావించాల్సి వస్తుంది అని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వివేకా హత్యకేసుని జగన్ ఎందుకు చేధించలేదు? తండ్రి, బాబాయ్ హత్యలను తనరాజకీయ లబ్ధికి వాడుకున్న నీచుడు జగన్ రెడ్డి. హత్యారాజకీయాలతో అధికారంలోకి వచ్చి, అధికారాన్ని కాపాడుకోవాలన్న భయంతో సొంత కుటుంబాన్ని వీధులపాలు చేసిన చరిత్ర జగన్ ది అని మాజీమంత్రి కేఎస్ జవహర్ ధ్వజమెత్తారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరుమార్పు జగన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట అని కేఎస్ జవహర్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం కేఎస్ జవహర్ మీడియాతో మాట్లాడారు. 'జగన్ రెడ్డి భయానికి అడ్రస్ గా మారాడు. ఆ భయంతోనే బాబాయ్ ని చంపేశాడు.. జగన్ రెడ్డికున్న ఆ భయమే సొంతచెల్లి షర్మిల,తల్లి విజయమ్మలను రాష్ట్రం విడిచిపోయేలా చేసింది. హత్యలు, హత్యారాజకీయాలతో లబ్ధిపొందడం జగన్‌కు అవినీతితో అబ్బిన విద్య. సొంత తండ్రిని రిలయన్స్ వారు చంపారని నానాగగ్గోలు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేయించి, అమాయకుల్ని బలితీసుకున్న జగన్, అధికారంలోకి రాగానే రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ చెప్పిన పరిమల్ నత్వానీకి వైసీపీ రాజ్యసభ సీటు ఇచ్చాడు.

ఇప్పుడు తన అధికారంతో బాబాయ్‌ని చంపినవారిని కాపాడుతూ, రక్తసంబంధాన్ని వీధులపాలు చేశాడు అని మాజీమంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. హత్యతో తమకు సంబంధంలేకుంటే, జగన్ రెడ్డి దంపతులు వారి కాల్ డేటాను ఎందుకు బయటపెట్డడంలేదు? అని నిలదీశారు. వివేకా హత్య కేసు నుంచి జగన్ దంపతులు తప్పించుకోలేరు అని మాజీమంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed