- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ పాలనలో చేనేతల అభివృద్ధి శూన్యం: కొల్లు రవీంద్ర
దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో చేనేతల అభివృద్ధి ఏం జరగలేదని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో హడావుడి చేయడం తప్ప ఈ మూడేళ్లలో చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాత్కాలిక తాయిలాలతో చేనేత వృత్తిని చంపేస్తున్నాడు అని మండిపడ్డారు. చేనేతలపై జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారు శాశ్వతంగా అభివృద్ధి చేందేందుకు అవకాశాలు కల్పించాలి అని సూచించారు.
తాయిలాలు ఇవ్వడం చేనేతల సమస్యలకు పరిష్కారం కాదని...నేతన్నలకు అధునాతన మగ్గాలు, ఇతర యంత్రాలు అందుబాటులోకి తెచ్చి, వృత్తిలో టెక్నాలజీని జోడించి వారి వ్యాపారంలో నూతన పద్ధతులను పాటించేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలి అని డిమాండ్ చేశారు.వ్యాపార మేళకువలు నేర్పించడం, అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయడం, ముడిసరుకు అందుబాటులో అందించడం, ముడి సరుకులను సబ్సిడీతో అందించాలి. వారి ఉత్పత్తులను పెంచే విధంగా తోడ్పటు నందించడం వల్ల వారు తమ వ్యాపారంలో అభివృద్ధి చెంది ఆర్థికంగా బలోపేతం అవుతారు అని మాజీమంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఇప్పటికైనా బటన్ నొక్కడంతో పాటు తెలంగాణాలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని చూసైనా బుద్దితెచ్చుకోవాలి అని హితవు పలికారు. బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తున్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. 'కొండా లక్ష్మణ్ బాపూజీ' పేరుతో అవార్డులు ఇస్తూ, ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్న విషయాన్ని మాజీమంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.