రాజధాని భూముల్లో స్కామ్: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
రాజధాని భూముల్లో స్కామ్: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాజధాని భూముల్లో(Amaravati capital Lands) స్కామ్‌కు పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) ఆరోపించారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ పేరు చెప్పి వేల ఎకరాల్లో భూములు దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో మంత్రి నారాయణ(Minister Narayana) పాత్ర ఉందని చెప్పారు. కానీ ఆ కేసును మూయించి వేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసులపై ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరగదన్నారు. రాష్ట్రం బయటే ఈ కేసుల్లో విచారణ చేపట్టాలని కాకాణి డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులను తప్పించుకునేందుకు సీనియర్ ఆఫీసర్లను చంద్రబాబు వేధిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి అడ్వొకేట్లను రాష్ట్రానికి రప్పించినట్లు కాకాణి తెలిపారు. స్కీల్ కేసులో ఈడీ అధారాలు సేకరించిందని చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా రూ. 332 కోట్లు చంద్రబాబుకు చేరాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed