- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు.. మాజీ మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కోర్టుకు హాజరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నివాసంపై దాడి చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేసు విచారణలో పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. ఈ రోజు కానీ, మరోసారి పోలీసుల విచారణకు హాజరవుతానని జోగి రమేశ్ చెప్పారు. కేసు విషయంలో వ్యవస్థలకు సహకరిస్తామని చెప్పారు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన సమయంలో తాను వాడిన కారుతో పాటు ఫోన్, సిస్ కార్డును తీసుకురావాలని పోలీసులు సూచించారని తెలిపారు. చంద్రబాబు ఇంటి వద్దకు నిరసన తెలియడానికి వెళ్లానని పేర్కొన్నారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు వద్దకు వెళ్లి నిరసన తెలియజేస్తే అయ్యన్నపాత్రుడి లాంటి నాయకులను అదుపు చేస్తారనే ఉద్దేశంతోనే వెళ్లామని తెలిపారు. దాడులు, గుండాయిజం తమ విధానం కాదని రాష్ట్ర ప్రజలకు, చంద్రబాబుకు తెలుసని మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు.