Breaking: మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు జోగి రమేష్‌.. అరెస్ట్ చేస్తారా..?

by srinivas |
Breaking: మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు జోగి రమేష్‌.. అరెస్ట్ చేస్తారా..?
X

దిశ, డైనమిక్‌ బ్యూరో: మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌‌లో విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్‌ హాజరయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను మూడు రోజుల కిందట అగ్రిగోల్డు భూముల వ్యవహారంలో అరెస్టు చేశారు. అదే రోజు సాయంత్రం జోగి రమేష్‌ను పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాలని కోరగా ఆయన రాలేదు. స్టేషన్‌కు రావల్సిందేనంటూ పోలీసులు మరోమారు తెలపడంతో ఆయన ఈ రోజు మంగళగిరి రూరల్‌ డీఎస్పీ ఆఫీసులో హాజరయ్యారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వందలాదిమంది కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్లి హల్‌చల్‌ చేశారు. అప్పట్లో ఆ కేసును నీరుగార్చేలా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసును బయటకు తీసి నోటీసులిచ్చారు. మూడు రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయన పోలీసుల హెచ్చరికతో ఎట్టకేలకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయనను వదలేస్తారా.. లేదా అరెస్టు చేస్తారా.. అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అయితే విచారణకు వెళ్లే ముందు జోగి రమేష్ మాట్లాడుతూ ఎన్నిసార్లు పిలిచినా తాను విచారణకు వస్తానన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి తాను నిరసన తెలియజేయడానికి వెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని జోగి రమేశ్ ఆరోపించారు.


జోగి రాజీవ్ అక్రమాలపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం.. శిక్ష తప్పదని వార్నింగ్

Advertisement

Next Story

Most Viewed