- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో కాంగ్రెస్ గెలిచే సీట్ల సంఖ్య తేల్చిచెప్పిన మాజీ మంత్రి చింతా
దిశ, వెబ్‌డెస్క్: వైఎష్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో నయా జోష్ నెలకొంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే షర్మిల తనదైన స్టైల్లో సోదరుడు, సీఎం జగన్, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ పార్టీలపై విరుచుకుపడుతోంది. షర్మిల చేరికతో కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ నెలకొనడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు యాక్టివ్ అయ్యారు. షర్మిలకు అండగా నిలుస్తూ మరోవైపు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీ, సీఎం జగన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఫైర్ అయ్యారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరికతో తమ పార్టీ వాయిస్ పెరిగిందని తెలిపారు. షర్మిలతో అధికార వైసీపీ పార్టీ ఓటు బ్యాంకుకు గండిపడుతోందని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి తిరిగి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాల్లో విజయం సాధించి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని జోస్యం చెప్పారు.